Saturday, July 5, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు

రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు

- Advertisement -

– అది ఒక పుస్తకం కాదు… అద్భుత గ్రంథం
– సామాజిక న్యాయ సూత్రం ఎజెండాగా పరిపాలన
– ప్రజా ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ విమర్శలా? : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. రాజ్యాంగం ఒక పుస్తకం కాదు… అది అద్భుత గ్రంథమని ఆయన చెప్పారు. రాజ్యాంగ మార్పుపై ప్రస్తుతం దేశంలో సైదాంతిక పోరాటం జరుగు తున్నదని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సామాజిక సమరభేరి సభలో భట్టి మాట్లాడారు. రాజ్యాంగ రక్షణ కోసం కాంగ్రెస్‌, ఇండియా కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని వివరించారు. అందుకు భిన్నంగా బీజేపీ, ఎన్డీఏ కూటమి రాజ్యాంగాన్ని మార్చేందుకు పోరాటం చేస్తున్నాయని గుర్తుచేశారు. దేశ ప్రజల ఆలోచనలతో పాటు గాంధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, జ్యోతిరావు పూలే ఆలోచనలను రాజ్యాంగంలో పొందుపరిచారని గుర్తు చేశారు. రాజ్యాంగమే లేకపోతే ఈ దేశంలోని పేదలు,సామాన్యులు, గిరిజనులు, దళితులకు, బల హీన వర్గాలకు ఎలాంటి హక్కులు ఉండేవి కావ న్నారు. దేశ సంపద, అవకాశాలు దేశంలోని ప్రజలం దరికీ సమానంగా ఉండాలని కాంగ్రెస్‌ భావిస్తోందని తెలిపారు. రాజ్యాంగానికి చిన్న ఇబ్బంది జరిగిన దేశంలోని సామాన్యులు హక్కులు కోల్పోతారని హెచ్చరించారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం సామాజిక న్యాయ సూత్రాన్ని అమలు చేసేందుకు అనేక రకాల సంక్షేమ కార్యక్ర మాలను రాష్ట్రంలో తీసుకువచ్చిందని వివరించారు. పదేండ్లపాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్‌ఎస్‌ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడిందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర ప్రజలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రెండు లక్షల రుణమాఫీ కింద 69 లక్షల రైతు కుటుంబాలకు రూ. 21,832 కోట్లను చెల్లించామన్నారు. రైతు భరోసా కింద అన్నదాతలకు పెట్టుబడి సాయం కోసం కేవలం తొమ్మిది రోజుల్లో రూ. 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. క్వింటాల్‌ వరి ధాన్యానికి రూ. 500 బోనస్‌, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రూ. 5 లక్షల రూపాయలు ఇస్తున్నామని పేర్కొన్నారు. రేషన్‌ దుకాణాల్లో సన్నబియ్యం పథకం కింద రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు రూ. 13,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు రాష్ట్రంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రారంభిస్తు న్నామన్నారు. ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలను తట్టుకోలేక ఏడుస్తూ విమర్శలు చేసే వారి గురించి కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
సామాజిక న్యాయానికి ఖర్గే ప్రతీక : టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌
ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే జీవితాంతం సెక్యులరిజం, సామాజిక న్యాయం, సామరస్యానికి ప్రతీకగా నిలిచారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌ కొనియాడారు. మల్లికార్జున ఖర్గేకు చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందన్నారు. సామాన్య స్థాయి నుంచి పార్టీ అత్యున్నత స్థాయికి ఆయన ఎదిగారని తెలిపారు. ఆయన జీవితం కృషి, నిబద్ధత, అంకితభావానికి చిరునామా అని కొనియాడారు. వరుసగా తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా, అనంతరం లోక్‌సభకు ఎన్నికయ్యారనీ, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారని గుర్తు చేశారు. దేశ చరిత్రలో మొదటిసారిగా గ్రామ స్థాయి అధ్యక్షులు మొదలుకుని రాష్ట్ర స్థాయి కార్యవర్గ సభ్యులకు ఖర్గే దిశా నిర్దేశం చేస్తున్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -