– మూడు గంటలపాటు అంతరాయం
– నిలిచిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నగరంలోని బోయపల్లి గేట్ వద్ద 6వ నంబర్ బోగి పట్టాలు తప్పినట్టు లోకో పైలట్ గుర్తించి రైలును నిలిపివేశారు. సుమారు 20 మీటర్ల మేర స్లీపర్ (సిమెంటు పట్టాలు)పై రైలు వెళ్లింది. గూడ్స్ రైలు రామగుండం నుంచి తమిళనాడుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో మహబూబ్‌నగర్-కర్నూలు మార్గంలో మూడు గంటలుగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. చెంగల్‌పట్టు, హంద్రీ, మైసూర్, సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు వద్ద మరమ్మతులు చేపట్టేందుకు కాచిగూడ నుంచి యాక్షన్ రిలీఫ్ ట్రైన్‌ను అధికారులు రప్పించారు.
మహబూబ్‌నగర్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
- Advertisement -
- Advertisement -



