– ఉవ్వెత్తున్న చెలరేగిన మంటలు
– ఇద్దరు డ్రైవర్లు, ఓ క్లీనర్ సజీవదహనం
– మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఘటన
నవతెలంగాణ-మరిపెడ
రెప్పపాటులో మూడు నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొని మంటలు చెలరేగి ఇద్దరు డ్రైవర్లు, ఓ క్లీనర్ మతి చెందారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ సమీపంలోని జాతీయ రహదారి 563పై శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కి చెందిన సర్వణ్ రాం(23) చేపల దాణా కోసం విజయవాడకు వచ్చారు. దాణా అయిన అనంతరం తిరిగి బయలుదేరాడు. ఇదే క్రమంలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి పరిధిలోని రాంనాథ్‌తండాకు చెందిన డ్రైవర్ గుగులోతు గణేష్(30) కరీంనగర్ నుంచి గ్రానైట్ లోడ్‌తో కాకినాడ వెళ్తున్నాడు. కాగా, మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ సమీపంలో సర్వణ్ రాం లారీ అదుపు తప్పి ఎదురుగా గ్రానైట్ లోడ్‌తో వస్తున్న లారీని ఢ కొట్టింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి డ్రైవర్లు గుగులోతు గణేష్, సర్వన్ రాం, క్లీనర్ బర్గత్ ఖాన్(23) సజీవ దహనమయ్యారు. స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వగా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు లారీలు ఢీ..
- Advertisement -
- Advertisement -