నవతెలంగాణ-హైదరాబాద్ : గులాబీ దళపతి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారట. మరో రెండు.. మూడు రోజుల్లో మీడియా ముందుకు రానున్నారట గులాబీ దళపతి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను, సాగునీటి అంశాలు మరియు ఇతర సమస్యలనుద్దేశింది మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలతో మాట్లాడనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
వైరల్ ఫీవర్ కారణంగా చికిత్స నిమిత్తం గురువారం యశోద హాస్పిటల్ లో అడ్మిట్ అయిన మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన పలువురు పార్టీ నేతలతో ఈ విషయాలను చర్చించినట్లు సమాచారం. అయితే, శుక్రవారం సాయంత్రమే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వాల్సి ఉండగా.. వైద్యుల సూచన మేరకు శనివారం వరకు హాస్పిటల్ లోనే వారి సంరక్షణలో ఉండనున్నారు.