Sunday, July 6, 2025
E-PAPER
Homeజాతీయంముంబాయి వ్యాపారాలను గుజ‌రాత్‌కు త‌ర‌లిస్తున్నారు: ఉద్ధ‌వ్ థాక‌రే

ముంబాయి వ్యాపారాలను గుజ‌రాత్‌కు త‌ర‌లిస్తున్నారు: ఉద్ధ‌వ్ థాక‌రే

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ముంబాయి వేదికగా శివ‌సేన‌(UBT) , మ‌హారాష్ట్ర న‌వ నిర్మాణ సేన చేప‌ట్టిన ఐక్యవేదిక మ‌హా స‌భ‌లో ఉద్ధ‌వ్ థాక‌రే బీజేపీ ప్ర‌భుత్వంపై గ‌ర్జించారు. 11ఏండ్ల పాల‌న‌లో ముంబాయి మ‌హాన‌గ‌రానికి ఫ‌డ్న‌వీస్ ప్ర‌భుత్వం చేసింది ఏంట‌ని ప్ర‌శ్నించారు. మ‌హారాష్ట్రకు వ‌స్తున్న ముఖ్య ప్రాజెక్టుల‌ను గుజ‌రాత్ రాష్ట్రానికి త‌ర‌లిస్తున్నార‌ని ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప‌లు వ్యాపారాలు, బ‌హుళ కంపెనీల ఆఫీస్‌ల‌ను కూడా గుజ‌రాత్ కు మ‌ళ్లీస్తున్నార‌ని చెప్పారు. డైమండ్ వ్యాపారాన్ని కూడా మోడీ రాష్ట్రానికి కేటాయించార‌ని మండిప‌డ్డారు. ఇక‌పై రాజ్ థాక‌రే, తాను మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల కోసం క‌లిసి ప‌ని చేస్తామని ఉద్ఘాటించారు.

ప్రైమ‌రీ స్కూల్‌లో హిందీని తృతీయ భాష‌గా త‌ప్ప‌నీస‌రిగా చేస్తూ ఫ‌డ్న‌వీస్ ప్ర‌భుత్వం ఓ తీర్మానం చేసింది. ఈయ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ భారీ యోత్తున ఆందోళ‌న‌లు వ్య‌క్తమైయ్యాయి. దీంతో ఫ‌డ్న‌వీస్ ప్ర‌భుత్వం వెనుకు త‌గ్గింది. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్న‌ట్లు మ‌హారాష్ట్ర స‌ర్కార్ వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ వ‌ర్లీ వేదిక‌గా శివ‌సేన‌(UBT), మ‌హారాష్ట్ర న‌వ నిర్మాణ సేన క‌లిసి విజ‌యోత్స‌వ స‌భ నిర్వ‌హించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -