నవతెలంగాణ – హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ₹6,000/- రూపాయలు అకౌంట్ లో జమ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా మరొక కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థి యొక్క స్కూలు ఒక కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉన్నట్లయితే ఆ విద్యార్థులకు ట్రావెల్ అలవెన్స్ కింద సంవత్సరానికి ₹6000 రూపాయలు విద్యార్థి యొక్క తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేసే విధంగా కొత్త కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ తగ్గి పిల్లల యొక్క హాజరు శాతాన్ని పెంచే విధంగా అలాగే విద్యార్థుల యొక్క అడ్మిషన్స్ ని ప్రభుత్వ పాఠశాలలో పెంచడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని జిల్లాల్లో ప్రారంభించారు.
పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకు రూ. 6,000
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES