- Advertisement -
నవతెలంగాణ – నిజాంసాగర్ : మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో శనివారం డెంగ్యూ వ్యాధి ఒకరికి పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి రోహిత్ కుమార్ తెలిపారు. వ్యాధి విస్తరించకుండా ముందు జాగ్రత్తగా పంచాయతీ కార్యదర్శికి అప్రమత్తం చేసినట్టు ఆయన తెలిపారు. పేషెంట్ ఇంటికి వెళ్లి చికిత్సను అందజేసి చుట్టుపక్కల ఇండ్లలోని ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు. గ్రామంలో దోమల నివారణకు ఫాగింగ్ చేయించడం జరుగుతుందని ఆయన తెలిపారు. వర్షాకాలం కావున గ్రామాలలోని ప్రజలు నీటిని నిల్వలు ఉంచకూడదని ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉంది నీటి నిల్వలు ఉన్నచోట ఆయిల్ బాల్స్ వెయ్యాలని ఆయన సూచించారు.
- Advertisement -