Sunday, July 6, 2025
E-PAPER
Homeసినిమా'ఓం శాంతి శాంతి శాంతిః'

‘ఓం శాంతి శాంతి శాంతిః’

- Advertisement -

తరుణ్‌ భాస్కర్‌ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లో లీడ్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తోంది. రూరల్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఎ ఆర్‌ సజీవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
సజన్‌ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్‌ కష్ణని, అనుప్‌ చంద్ర శేఖరన్‌, సాధిక్‌ షేక్‌, నవీన్‌ సనివరపు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్‌ జలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలు. ఇది ఎస్‌ ఒరిజినల్స్‌, మూవీ వెర్స్‌ స్టూడియోస్‌ జాయింట్‌ ప్రొడక్షన్‌.
షూటింగ్‌ ఇప్పటికే పూర్తయింది. 2డీ యానిమేషన్‌ స్టయిల్‌లో ప్రజెంట్‌ చేసిన కాన్సెప్ట్‌ వీడియోతో పాటు ఆకట్టుకునే టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేయడంతో మేకర్స్‌ ప్రమోషన్‌లను ప్రారంభిం చారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ పోస్టర్‌ గొడవ పడుతున్న జంట చేతులను చూపించడం ఆసక్తికరంగా ఉంది. ‘ఓం శాంతి శాంతి శాంతిః ‘అనే టైటిల్‌ విజువల్స్‌లో చూపించిన గొడవకు ఫన్‌ యాడ్‌ చేసింది. కాన్సెప్ట్‌ వీడియోలో ఈషాను కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయిగా, తరుణ్‌ను వ్యాన్‌ యజమాని అంబటి ఓంకార్‌ నాయుడుగా పరిచయం చేశారు. వారి పెళ్లి తర్వాత కథ మలుపు తిరుగుతుంది. ఇద్దరి మధ్య వాగ్వీదాలు, గొడవలు పందెంకోళ్ల తలపించేట్టుగా చూపించారు. జై క్రిష్‌ మ్యూజిక్‌ రూరల్‌ చార్మ్‌ని మరింతగా ఎలివేట్‌ చేయగా, దీపక్‌ యెరగర కెమెరా పనితనం మెస్మరైజ్‌ చేసింది. ఈ చిత్రం హ్యుమర్‌, కల్చర్‌, రిలేషన్షిప్‌ డ్రామాతో అందరినీ అలరించబోతోంది. ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -