Sunday, July 6, 2025
E-PAPER
Homeజాతీయంసైలెన్స్‌ ఫర్‌ గాజాకు సీపీఐ(ఎం) మద్దతు

సైలెన్స్‌ ఫర్‌ గాజాకు సీపీఐ(ఎం) మద్దతు

- Advertisement -

ఇజ్రాయిల్‌ దాడులకు వ్యతిరేకంగా
డిజిటల్‌ నిరసనలో భాగమవ్వండి
ప్రతిరోజూ రాత్రి 9 నుంచి 9.30 వరకు ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేయండి
ప్రజలకు పార్టీ పొలిట్‌బ్యూరో పిలుపు

న్యూఢిల్లీ : గాజాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) స్పందించింది. ప్రపంచవ్యాప్తం గా జరుగుతున్న ‘సైలెన్స్‌ ఫర్‌ గాజా’ డిజిటల్‌ నిరసనకు పార్టీ పొలిట్‌బ్యూరో మద్దతు పలికింది. ప్రజలు ప్రతి రోజూ రాత్రి 9 గంటల నుంచి 9.30 గంటల వరకు ఫోన్లను స్విచ్‌ ఆఫ్‌ చేయాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ పొలిట్‌ బ్యూరో ఒక ప్రకటనను విడుదల చేసింది. పొలిట్‌బ్యూరో ప్రకటన ప్రకారం.. ఇటీవల విడుదలైన యూఎన్‌ నివేదిక ఒకటి.. గాజాపై ఇజ్రాయిల్‌ దాడిలో వివిధ బహుళజాతి సంస్థలు, కంపెనీలు ఎలా భాగస్వాములుగా ఉన్నాయో వివరిస్తున్న ది. ఈ సంస్థల దుష్టపాత్రను మనం బహిర్గతం చేయాలి. వాటిని ప్రజలకు జవాబుదారీగా ఉంచాలి. నిర్దేశిత సమయ ంలో ప్రతీ రోజు ఒక అరగంట పాటు మొబైల్‌ ఫోన్లను స్విచ్‌ ఆఫ్‌ చేయటమనేది ఒక చిన్న చర్యే అయినా.. ఇది నిఘా ఆధారిత వ్యాపార ధోరణులకు, ఇజ్రాయిల్‌ దౌర్జన్యానికి వ్యతిరేంగా ఉన్నతమైన ప్రతిఘటన. ఈ డిజిటల్‌ నిరసనలో దేశవ్యాప్తంగా ప్రజలందరూ చురుకుగా పాల్గొనాలి. నిరసన సమయంలో మొబైల్‌ ఫోన్లను స్విచ్‌ ఆఫ్‌ చేయాలనీ, ఏ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనైనా పోస్ట్‌ చేయటం, లైక్‌ చేయటం, వ్యాఖ్యానించటం మానుకోవాలని వివరించింది. గాజా ప్రజల పక్షాన నిలబడటానికి, యుద్ధ నేరాలను ఖండించేందుకు ప్రతి ఒక్కరూ ఈ మౌన నిరససనలో భాగస్వాములు కావాలని సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -