Monday, July 7, 2025
E-PAPER
Homeజాతీయంట్రంప్‌ సుంకాలకు మోడీ తలొగ్గుతారు

ట్రంప్‌ సుంకాలకు మోడీ తలొగ్గుతారు

- Advertisement -

రాహుల్‌ గాంధీ విమర్శ
న్యూఢిల్లీ :
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయూశ్‌ గోయల్‌ గుండెలు బాదుకోవడం తప్ప చేసేదేమీ ఉండదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సుంకాలకు భారత ప్రధాని మోడీ తలొగ్గుతారనీ, తన మాటలు నమ్మకపోతే రాసిపెట్టుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా పరస్పర సుంకాల సస్పెన్షన్‌ ఈనెల 9న ముగియనున్నందున, ఆ గడువుకు ముందే చర్చలు పూర్తి చేయాలని ఇరుదేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూశ్‌ గోయల్‌ మాట్లాడుతూ.. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్‌ పటిష్ట విధానాలను కలిగి ఉందని తెలిపారు. గడువు ఆధారంగా కీలకమైన వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకునేందుకు దేశం ఎప్పుడూ తొందరపడదని అన్నారు. రెండు వర్గాలకు లాభదాయకంగా ఉంటేనే అంగీకరిస్తుందని చెప్పారు. అయితే గోయల్‌ వ్యాఖ్యలను రాహుల్‌ కొట్టిపారేశారు. అమెరికా ఒత్తిళ్లకు మోడీ తలొగ్గుతారని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -