Monday, July 7, 2025
E-PAPER
Homeక్రైమ్ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

- Advertisement -

– మహిళ మృతి, ఒకరికి గాయాలు
నవతెలంగాణ-భువనగిరి

టీవీఎస్‌ లూనాను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ మహిళ మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో శనివారం జరిగింది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్‌ మండలం మొగ్గుంపల్లికి చెందిన సిల్వేరు సత్యనారాయణ, మల్లమ్మ దంపతులు ఉదయం టీవీఎస్‌ లూనాపై వస్తున్నారు. భువనగిరి పట్టణంలోని జంఖన్నగూడెం చౌరస్తా వద్ద నల్లగొండ నుంచి భువనగిరి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లూనాను వేగంగా వచ్చి ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో మల్లమ్మ(40) అక్కడికక్కడే మృతిచెందింది. సత్యనారాయణకు గాయాలయ్యాయి. దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఉండగా ఒక కుమార్తె వివాహం అయింది. మరో ఇద్దరు పాఠశాల విద్య చదువుతున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -