Monday, July 7, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇండొనేషియాలో మరోసారి బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం..

ఇండొనేషియాలో మరోసారి బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండొనేషియాలోని లెవోటోబి లకి లకి అగ్నిపర్వతం మరోసారి బద్ధలైంది. తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్‌లోని ఫ్లోర్స్‌ ద్వీపంలో ఈ లకిలకి అగ్నిపర్వతం ఉంది. ఇది ఇండొనేషియాలోనే అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటి. ఇది సోమవారం ఉదయం విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం నుంచి బూడిద ఆకాశంలోకి 18 కిలోమీటర్ల ఎత్తు కంటే ఎక్కువ ఎత్తుకు ఎగసిపడుతోంది. దీంతో సమీపంలోని గ్రామాలను పెద్ద ఎత్తున బూడిద కప్పేసింది.

ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఎలాంటి మరణాలూ సంభవించలేదని అధికారులు తెలిపారు. మరోవైపు అగ్నిపర్వతం బద్దలవడంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బాలికి వెళ్లాల్సిన పలు విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1,584 మీటర్ల (5,197 అడుగులు) ఎత్తున్న లకిలకి అగ్నిపర్వతం చాలా క్రియాశీలకంగా ఉన్నది. ఇది విస్ఫోటనం చెందడం నెల వ్యవధిలోనే ఇది రెండోసారి కావడం గమనార్హం. గత నెల 18వ తేదీన కూడా ఈ అగ్నిపర్వతం బద్దలైంది. అంతకుముందు ఈ ఏడాది మార్చి 21న విస్ఫోటనం చెందింది. గతేడాది నవంబర్‌లో కూడా బద్ధలైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -