జింబాబ్వేతో దక్షిణాఫ్రికా రెండో టెస్టు
బులావయో (జింబాబ్వే) : సఫారీ యువ ఆటగాడు వియాన్ ముల్డర్ (367 నాటౌట్, 334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్స్‌లు) ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. పసికూన జింబాబ్వే బౌలర్లపై విధ్వంసకాండ రచించిన ముల్డర్..297 బంతుల్లోనే త్రి శతకం సాధించాడు. బ్రియాన్ లారా (400) రికార్డుకు 33 పరుగుల దూరంలో నిలిచిన ముల్డర్.. అనూహ్యంగా ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్ ప్రకటించాడు. డెవిడ్ (82), ప్రిటోరియస్ (78) సైతం రాణించటంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 114 ఓవర్లలో 5 వికెట్లకు 626 పరుగులు చేసింది. అరుదైన మైలురాయికి చేరువై, టెస్టులో మరో మూడు రోజుల సమయం ఉన్నప్పటికీ ముల్డర్ డిక్లరేషన్‌కు మొగ్గుచూపాడు. సఫారీ బౌలర్లు నిప్పులు చెరగటంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 170 పరుగులకే కుప్పకూలింది. 456 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో నిలిచిన జింబాబ్వేను దక్షిణాఫ్రికా ఫాలోఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 16 ఓవర్లలో 51/1తో నిలిచింది. జింబాబ్వే మరో 405 పరుగుల వెనుకంజలో కొనసాగుతుంది.
ముల్డర్ 367 నాటౌట్
- Advertisement -
- Advertisement -