మండల ప్రజా పరిషత్ పునర్వ్యవస్థీకరణ
నేడు ముసాయిదా నోటిఫికేషన్ విడుదల
అభ్యంతరాల స్వీకరణకు రెండు రోజుల గడువు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతి మండల పరిషత్‌లో కనీసం ఐదు ఎంపీటీసీలుండేలా పునర్వ్యవస్థీకరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన కలెక్టర్లను, ఎన్నికల అధికారుల ను ఆదేశించారు. మండల ప్రజా పరిషత్‌ను పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ఎంపీటీసీల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటైనప్పటికీ చాలా ఎంపీటీసీలు పాత మండలాల పరిధిలోనే ఉన్నాయి. ఎంపీపీలు కూడా పాత మండలాల వారీగానే ఉన్నారు. జిల్లాల్లో చాలా వరకు కొత్త మండలాలు, కొత్త గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. అదే సమయంలో జిల్లా, పట్టణ కేంద్రాల సమీపంలోని ఆయా గ్రామాలను మున్సిపాల్టీలను విలీనం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే మండలాల్లో ఎంపీటీసీల పునర్వస్థీకరణకు రాష్ట్ర సర్కారు పూనుకున్నది. ఇప్పుడు ఒక మండలాన్ని ప్రాతిపదికన తీసుకుని ఎంపీటీసీల సంఖ్యను కొత్తగా నిర్ణయించనున్నది. పంచాయతీరాజ్(సవరణ) యాక్టు-2025 ప్రకారం విభజించనున్నది. ఎంపీటీసీల డ్రాఫ్ట్ పబ్లికేషన్‌ను మంగళవారం(8.7.25)న విడుదల చేయనున్నది. 8,9 తేదీల్లో ఎంపీటీసీ స్థానాల్లో కొత్త పంచాయతీలను కలపడం, ఎక్కువ ఓట్లున్న ఎంపీటీసీల పరిధిలోని గ్రామాలను విభజించడానికి సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు తెలిపింది. 10,11 తేదీల్లో అభ్యంతరాలను పరిశీలించి సాధ్యాసాధ్యాల మేరకు పరిష్కరించనున్నది. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్‌ను 12వ తేదీన విడుదల చేయనున్నది.
మండలానికి కనీసం ఐదు ఎంపీటీసీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES