Tuesday, July 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళా సంఘాల సభ్యుల ప్రమాద బీమా పొడిగింపు

మహిళా సంఘాల సభ్యుల ప్రమాద బీమా పొడిగింపు

- Advertisement -

1.67 లక్షల మంది
సభ్యులకు బీమా వర్తింపు
జీవో జారీ చేసిన రాష్ట్ర సర్కారు
ఇప్పటి వరకూ 409 మందికి లబ్ది
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మహిళా స్వయం సహాయక బృందాల సభ్యుల ప్రమాద బీమా పథకాన్ని 2029వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. స్త్రీ నిధి ద్వారా బీమా అమలు కొనసాగించాలని అధికారులను పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌ ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో 1.67 లక్షల మంది సభ్యులకు ఈ బీమా వర్తించనున్నది. ప్రమాదవశాత్తు మరణించిన ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రూ.10 లక్షల బీమాను కాంగ్రెస్‌ సర్కారు వర్తింపజేస్తున్న విషయం విదితమే. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 409 మందికి ప్రమాద బీమా మంజూరైంది. మహిళా సంఘాల సభ్యులెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఇస్తున్న బీమా బాధిత కుటుంబాలకు ఇతోధికంగా దోహదపడుతున్నది. ఈ నేపథ్యంలో ప్రమాద బీమాను మరో నాలుగేండ్లు పొడిగిస్తూ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -