No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతాజా వార్తలు10న రాష్ట్ర మంత్రివర్గ భేటీ

10న రాష్ట్ర మంత్రివర్గ భేటీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ఈనెల 10న మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. విధానపరమైన అంశాలపై ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతి నెలా రెండు పర్యాయాలు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీ సుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ సమావేశా న్ని నిర్వహించనుంది.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ సమరి్పంచిన తుది నివేదికపై మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. దీని ఆధారంగా బరాజ్‌ల పునరుద్ధరణకు తదుపరి కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేయనుంది. ఈనెల 14 నుంచి కొత్త రేషన్‌ కార్డుల జారీని ప్రభుత్వం ప్రారంభించనుంది. దీనిపై కూడా మంత్రివర్గం చర్చించి ఆమోదించనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది. స్టాంపుల చట్ట సవరణ బిల్లును మంత్రివర్గం ఆమోదించనుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad