- Advertisement -
నవతెలంగాణ – పరకాల
శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామంలో నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన వ్యక్తి స్వర్గం రాజు ఇటీవల అకాల మరణం చెందడం జరిగింది. మౄతుడికి ఇద్దరు చిన్నపిల్లలు కుటుంబ ఆర్థిక వ్యవస్థ బాగోలేనీ కారణంగా వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో పరకాల మున్సిపాలిటీ 9వ వార్డు మాజీ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి మంగళవారం నేరేడు పల్లిలోని మృతుడి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 50 కిలోల బియ్యం, నిత్యవసర సరుకులు, తగినంత ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -