- Advertisement -
నవతెలంగాణ – గాంధారి : వనమహోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని గాంధారి మండల కేంద్రంలో ప్రత్యేక అధికారి, డీపీఓ మురళితో కలిసి ఎంపీడీఓ రాజేశ్వర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ లక్ష్మి నారాయణ, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, ఉపాధి హామీ పథకం ఏపీఓ మధు, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి సిబ్బంది కూలీలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -