Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి..!

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి..!

- Advertisement -
  • తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ పిలుపు.

నవ తెలంగాణ- మల్హర్ రావు: రేపు దేశవ్యాప్తంగా చేపట్టబోయో సార్వత్రిక సమ్మె కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజాప్రంట్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ పిలుపునిచ్చారు. మంగళవారం కాటారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. దేశవ్యాప్తంగా చేపట్టబోయే సార్వత్రిక ఒక్కరోజు సమ్మెను కార్మిక, కర్షక వర్గం జయప్రదం చేయాలన్నారు. మోడీ ప్రభుత్వం “ఆత్మ నిర్భర్ భారత్” లో భాగంగా 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లగా విభజించి కార్మికుల న్యాయమైన చట్టాలకు తూట్లు పొడిచార‌ని విమ‌ర్శిచారు. కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ జులై 9న కార్మిక లోకం ఒక్కరోజు మెరుపు సమ్మెకు పిలుపునివ్వడం మంచి పరిణామన్నారు. దీనికి తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కమిటీ సంఘీభావం తెలుపుతూ తమ శ్రేణులను ఆ సమ్మెలో పాల్గొనెలా పిలుపునిచ్చినట్లుగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -