నవతెలంగాణ-పెద్దవూర
రాష్ట్రంలో నడిచేది ప్రాజా పాలన కాదు ప్రజలను దోచుకునే పాలన అని నాగార్జునసాగర్ మాజీ శాసన సభ్యులు నోముల భగత్ కుమార్ అన్నారు. మంగళవారం గుర్రంపోడ్ మండలం, కొప్పోల్ గ్రామం తులసి ఫంక్షన్ హల్లో మంగళవారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు .కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి18 నెలలు కావస్తున్న ప్రజలకు ఇచ్చిన హామీలు అందజేయకపోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన ఎలా చేయాలో అవగాహన లేదని, కనీసం గుంపు మేస్త్రి పాత్ర కూడా చేయడం చేతకావడం లేదని అన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు గుర్రంపోడు మండలంలోని నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో గతంలో కేసీఆర్ చేసిన అభివృద్దే కానీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేదల పొట్ట కొట్టి కాంగ్రెస్ నాయకులు కడుపు నింపు కుంటున్నారని అన్నారు. నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలియదు కానీ దోచుకోవడం ఎలాగో కాంగ్రెస్ నాయకులకు వెన్నేతో పెట్టిన విద్యఅని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలుసురక్షితమని, కాంగ్రెస్ పాలనలో రౌడీయిజం,ప్రశ్నించే గొంతులను అణిచివేయడం జరుగుతుందని అన్నారు.
మండలం లో బిఆర్ఎస్ నాయకులు గ్రామ గ్రామాన తిరిగి గత కేసిఆర్ ప్రభుత్వంలో ఎలా ఉందో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా ఉందో ప్రజలకు వివరించాలని తెలిపారు.పోయింది అధికారం మాత్రమే కాని తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది గులాబీ జెండానేఅని అన్నారు.సాగర్ నియోజకవర్గంలో వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో గుర్రంపోడు మండలంలోని వివిధ గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.