- Advertisement -
- సీఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ-కంఠేశ్వర్: పార్టీల కండువాలు వేరైనా బీజేపీ-కాంగ్రెస్ విధానం ఒకటేనని, కార్మిక వర్గంపై జరుగుతున్న నిరంకుశతో దాడిపై జులై 9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేసి.. బీజేపీ-కాంగ్రెస్ ప్రభుత్వాలకు కార్మిక వర్గం బుద్ధి చెప్పాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఏ మేరకు మంగళవారం బేవరేజ్ హమాలి లల్లో సమ్మె బుక్ లేట్లను కరపత్రాలను పంచుతూ ప్రచారం చేశారు. జులై 9 జరిగే సమ్మెలో కార్మికలోకం పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. కార్పొరేట్ లా ఖజానా నింపడానికి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలు చేయడమే వారి లక్ష్యమని, లేబర్ కోడ్ ల పేరుతో కార్మికులకు ఉన్న 49 చట్టాల నుంచి 29 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లు తెచ్చి బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు వారి ఖజానా నింపుకోవడానికి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా బలి చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక ఈ లేబర్ కోడ్ లను రద్దు చేయకుంటే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెలకు కూడా రైతంగ పోరాట స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు శ్రీనివాస్, రమేష్, కుమారస్వామి, ఎస్ శీను, వెంకటస్వామి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.


- Advertisement -