Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా సంఘాలు ఆర్థిక శక్తిగా ఎదగాలి..

మహిళా సంఘాలు ఆర్థిక శక్తిగా ఎదగాలి..

- Advertisement -

మండల ప్రత్యేక అధికారి సంజయ్ కుమార్ 
నవతెలంగాణ-రామారెడ్డి 
: మహిళా సంఘాలు ఆర్థిక శక్తిగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యమని మండల ప్రత్యేక అధికారి సంజయ్ కుమార్ మంగళవారం మహిళా సంఘాలకు సూచించారు. మండల కేంద్రంలో మహిళా సమైక్య సమావేశాన్ని ఏపిఎం ప్రసన్నకుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ… ఇందిరమ్మ మహిళ శక్తి వారోత్సవాల్లో భాగంగా గత సంవత్సరం మహిళా సంఘాల పనితీరు సమీక్ష, ఈ సంవత్సరం గత సంవత్సర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సాధించబోయే ప్రగతిని మహిళా సంఘాలకు వివరించారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల్లో మహిళా సంఘాలు పాల్గొనాలని ఎంపీడీవో తిరుపతిరెడ్డి సూచించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా వృద్ధుల సంఘాలను, దివ్యాంగుల సంఘాలను ఏర్పాటు చేయాలని మండల సమైక్య అధ్యక్షురాలు సూచించారు. కార్యక్రమంలో సీసీలు, వివో లు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -