Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గత పాలకుల నిర్లక్ష్యం వల్లే కేంద్రీయ విద్యాలయం ఆలస్యం

గత పాలకుల నిర్లక్ష్యం వల్లే కేంద్రీయ విద్యాలయం ఆలస్యం

- Advertisement -

మద్నూర్ లో కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణం స్థలం పరిశీలించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ – మద్నూర్
: మద్నూర్ మండల కేంద్రానికి మంజూరైన కేంద్రీయ విద్యాలయం గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఏళ్ళ తరబడి ఆలస్యం అయిందని ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు తెలిపారు. కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణం కోసం మండల కేంద్రంలో పాత ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ స్థలంలో నిర్మించేందుకు నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగిందని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

కేంద్రీయ విద్యాలయం తాత్కాలికంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో ప్రారంభమవుతుందని, పాత గెస్ట్ హౌస్ స్థలంలో భవన నిర్మాణం అనంతరం కేంద్రీయ విద్యాలయాన్ని ఇక్కడ మార్చడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. భవన నిర్మాణం చేపట్టడం మండల కేంద్రానికి ఎంతో గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ స్థల పరిశీలన కార్యక్రమంలో రెవెన్యూ అధికారులతో పాటు స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -