- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : మండల కేంద్రంలోని పాత గెస్ట్ హౌస్ స్థల పరిశీలన కోసం వచ్చిన జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావును ముదిరాజ్ సంఘం నాయకులు సంతోష్ మేస్త్రి, కల్లూరు వార్ అశోక్, శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీ సంఘానికి కాంపౌండ్ వాల్ నిర్మించుకోండి నిధులు ఇస్తా అని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో ముదిరాజ్ సంఘం తరఫున ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -