Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి తరలిరావాలి 

మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి తరలిరావాలి 

- Advertisement -

మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అర్రెం లచ్చు పటేల్ 
నవతెలంగాణ – తాడ్వాయి 

రేపు ములుగు జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి ప్రారంభోత్సవానికి మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు అందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అర్రెం లచ్చు పటేల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో గల డీఎల్ఆర్ ఫంక్షన్ లో ఉదయం 9 గంటలకు అందరూ హాజరుకావాలని కోరారు.  మన ప్రియతమ నాయకురాలు, ఆదివాసి ముద్దుబిడ్డ రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క జన్మదిన వేడుకలు, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేగ కళ్యాణి గారి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు , అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మంత్రీ సీతక్క గారి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరెం లచ్చుపటేల్, మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరిల వెంకన్న, మండల నాయకులు కట్కూరి భాస్కర్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -