నవతెలంగాణ – అశ్వారావుపేట : ఎమ్మెల్యే పుట్టిన రోజు అనగానే కేక్ లు, శాలువాలు, అభినందనలు, ఆశీస్సులతో వచ్చిపోయే అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో హడావుడి ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తన పుట్టిన రోజును అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు, వన మహోత్సవంలో మొక్కలు నాటుతూ జరుపుకున్నారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో ఆయన మంగళవారం విస్త్రుత పర్యటన చేసి ఐటీడీఏ నిధులతో నిర్మించిన సీసీ రోడ్ లు, పాఠశాలల అదనపు గదులను ప్రారంభించారు.
మొత్తం రూ. 81 లక్షల వ్యయంతో చేసిన అభివృద్ది పనులు ప్రారంభించారు. కేసప్పగూడెం పంచాయితీ రాజాపురం, వేదాంత పురం పంచాయితీ నల్లబాడు, మల్లాయిగూడెం పంచాయితీ పండువారిగూడెం, నారాయణపురం, బచ్చువారిగూడెం పంచాయితీ ఆశి వారి గుంపు, గుమ్మడవల్లి కొత్తూరు, ఆసుపాక, గాండ్లగూడెం పంచాయతీ కార్యాలయం నూతన భవనం, కోయ రంగాపురం, నందిపాడు పాఠశాలల్లో అదనపు గదులు ప్రారంభించారు.
కుడుములపాడులో పాఠశాల విద్యార్ధులకు పోలీస్ శాఖ సౌజన్యం తో నేను సైతం విద్యకు చేయూత లో విద్యా సామాగ్రి అందించారు. ఆయన పర్యటించిన ప్రతీ గ్రామంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ప్రత్యేక అధికారి,పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ కే.ప్రదీప్ కుమార్,ఎంపీడీవో ప్రవీణ్ కుమార్,ఐటీడీఏ ఏఈఈ ప్రసాద్ రావు, ఎంజీఎన్ఆర్ ఈజీఏ ఏపీవో కే.రామచంద్రరావు, ఆర్ఐ క్రిష్ణ, కాంగ్రెస్ నాయకులు తుమ్మ రాంబాబు, జూపల్లి ప్రమోద్, బండి చెన్నారావు, ఆకుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.