Wednesday, July 9, 2025
E-PAPER
Homeకరీంనగర్రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..

- Advertisement -

నవతెలంగాణ – వేములవాడ రూరల్ : వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో ఓ యువకుడు తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే బతుకుదెరువు కోసం గుంటూరు నుంచి వచ్చిన మేస్త్రి చల్ల వీరాంజనేయులు కుమారుడు శివప్రసాద్ (16) ఆదివారం రాత్రి నక్క వాగు బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో శివప్రసాద్ తలకు తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.

మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం వారి స్వస్థలం గుంటూరు తరలించారు. చికిత్స పొందుతూ శివ ప్రసాద్ మృతి చెందడంతో స్థానిక గ్రామంలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే శివప్రసాద్ కుటుంబం దాదాపు 30 సంవత్సరాలుగా గ్రామంలో ఉంటూ గృహ నిర్మాణాలు చేసుకుంటూ ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి శివప్రసాద్ చిన్న వయసులో అర్ధాంతరంగా కన్నుమూయడంతో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -