Wednesday, July 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహైదరాబాద్‌లో బాంబు బెదిరింపుల కలకలం

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపుల కలకలం

- Advertisement -

– సిటీ సివిల్‌ కోర్టులో తనిఖీలు
– ఫేక్‌ అని తేల్చిన పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో/ధూల్‌పేట్‌

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు మంగళవారం బెదిరింపు మెయిల్స్‌ రావడంతో పోలీస్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. రాజ్‌భవన్‌, పాతబస్తీలోని సిటీ సివిల్‌ కోర్టు, జింఖానా క్లబ్‌, సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టుల్లో బాంబులు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్‌ చేశాడు. దాంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. పాతబస్తీలోని సిటీ సివిల్‌ కోర్టులో కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. పోలీస్‌ బలగాలు న్యాయవాదులను, కోర్టు సిబ్బందిని బయటకు పంపగా డాగ్‌ స్క్వాడ్‌, బాంబు స్కాడ్‌, క్లూస్‌ టీమ్‌లోనికి వెళ్లి ప్రధాన భవనంతోపాటు ప్రాంగణంలోని అన్ని భవనాలనూ తనిఖీలు చేశారు. ఎలాంటి బాంబు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇతర చోట్ల కూడా ఏమీ దొరకలేదు. దాంతో అవి ఫేక్‌ మెయిల్స్‌ అని పోలీసులు తేల్చారు. అన్నా వర్సిటీ పూర్వ విద్యార్థుల పేరుతో మంగళవారం తెల్లవారుజామున 3.43 గంటల సమయంలో ఆగంతకుడు మెయిల్‌ పంపినట్టు గుర్తించారు. నగరం సేఫ్‌గా ఉందని, వదంతులను నమ్మొద్దని పోలీసులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -