– ఆయనను గోకుడెందుకు? తన్నిపిచ్చుకోవడమెందుకు? : కేటీఆర్‌కు జగ్గారెడ్డి కౌంటర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చించేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భయపడుతున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు. ఏదో విధంగా ఆయనను గోకి, తన్నిపిచ్చుకోవడం ఎందుకు? అని ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలపై అసెంబ్లీలో చర్చించకుండా ప్రెస్‌క్లబ్‌కు వెళ్లి కూర్చుంటే లాభమేంటని కేటీఆర్‌ను నిలదీశారు. మంగళవారం హైదరా బాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేసీఆర్ తన కుమారునికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో ఆయన నేరుగా అసెంబ్లీలో అడుగుపెట్టారని ఎద్దేవా చేశారు. ఆయన సర్పంచ్‌గా, జడ్పీటీసీగా గెలిచారా? మరి ఆయనకు డఖ్కముక్కీలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. తాము ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు పొందామని వివరించారు. అందుకే తాము ప్రజల కోసం అనుభవంతో కూడిన రాజకీయాలు చేస్తున్నామని తెలిపారు. తమ అనుభవం ముందు కేటీఆర్ జీరో అని అన్నారు. తమను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదన్నారు. ‘కేటీఆర్ ఒకటి అంటే తాము పది మాటలంటాం. గాడిదలంటే పడేటోళ్లు ఎవరూ లేరు. రాష్ట్రాన్ని ఐదేండ్లు పాలించాలని ప్రజలు మాకు అవకాశం కల్పించారు. ప్రజాపాలన అందించాలన్నదే మా లక్ష్యం. బీఆర్‌ఎస్ నాయకులు ఒక్క తిట్టుతిడితే మేం పది బూతులు తిడతాం. ఇందులో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దెబ్బలకు కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారు. 18 నెలలుగా అధికారం లేకపోయేసరికి ఆయన ఓడ్డున పడ్డ చేపలా కొట్టుకుం టుండు’ అని విమర్శించారు. ఇటీవల కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉండటం లేదనీ, నెలకు 20 రోజులపాటు విదేశాల్లో గడుపుతున్నారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర హక్కులను కాపాడేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నారని చెప్పారు. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఏనాడైనా కేంద్ర మంత్రులను కలిశారా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో కేటీఆర్ వ్యవహరిస్తున్న తీరు చిన్న పిల్లల మాదిరిగా ఉందని విమర్శించారు.
సీఎంతో చర్చించే స్థాయి లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES