Wednesday, July 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు ఏపీ క్యాబినెట్‌ భేటీ..

నేడు ఏపీ క్యాబినెట్‌ భేటీ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌ సమావేశం జరగనుంది.. రాజధాని లో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది క్యాబినెట్.. 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా ఆమోదం తెలపనుంది.. రాజధాని నిర్మాణానికి ఇసుక డీసిల్టేషన్‌కు అనుమతి ఇవ్వనుంది క్యాబినెట్‌.. మరోవైపు, హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్‌కు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం.. అమరావతిలో అల్లూరి, అమరజీవి స్మారక చిహ్నాలు ఏర్పాటుపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు సీఎం, మంత్రులు.. ఇక, అమ‌రావ‌తిలో ప‌లు సంస్థల‌కు భూ కేటాయింపులకు అమోదం తెలపనుంది క్యాబినెట్‌.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారి.. కేంద్రం వరకు చేరిన బనకచర్ల ప్రాజెక్ట్ కు సంబంధించి కూడా క్యాబినెట్‌లో ప్రత్యేకంగా చర్చించనున్నారు.. మరోవైపు, సుపరిపాలన… తొలి అడుగు ఫీడ్ బ్యాక్ పై క్యాబినెట్‌ తర్వాత మంత్రులతో చర్చించనున్నారట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -