- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రస్తుతం అన్నింటికి ఆధార్ కార్డే ఆధారం. ఈ కార్డు లేకుంటే ఏ పని జరగని పరిస్థితి ఏర్పడింది. ఆధార్ కార్డును మొబైల్ నెంబర్‌తో లింక్ చేయాలి. లేకుంటే వివిధ సందర్భాల్లో ఓటీపీ రాని పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్‌ను ఎలా లింక్ చేయాల్లో తెలుసుకుందాం.
ఆన్‌లైన్‌లో లింక్ చేయడం ఎలాగంటే..
- ముందుగా UIDAI అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించాలి.
- ఈ వెబ్ సైట్‌లో ముందుగా మీరు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- ఆ తర్వాత.. మీరు ప్రొసీడ్ టు బుక్ అపాయింట్‌మెంట్‌పై క్లిక్ చేయాలి.
- దీంతో మీ ముందు ఒక కొత్త పేజి తెరుచుకుంటుంది. దీనిలో మీరు మొబైల్ నెంబర్‌తోపాటు క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి.. జనరేట్ ఓటీపీ( OTP)పై క్లిక్ చేయాలి.
- మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేసి.. సబ్‌మీట్ ఓటీపీపై క్లిక్ చేసి ప్రొసీడ్ చేయాలి.
- అనంతరం మీరు ఏ వివరాలను మార్చుకోవాలో.. అందులో ఎంచుకోవాలి. దీని తర్వాత అవసరమైన ఇతర సమాచారాన్ని నమోదు చేసుకోవాలి.
- ఈ విధంగా మీరు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇచ్చిన తేదీ.. సమయం, మీరు ఎంచుకున్న ఆధార్ కేంద్రానికి వెళ్లి.. మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేయాలి.
ఆఫ్‌లైన్‌లో అప్ డేట్ చేయాలంటే..
- తొలుత మీరు మీ ఇంటి సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి.. ఈ పనిని పూర్తి చేయవచ్చు.
- మీరు UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆధార్ కేంద్రం సమాచారాన్ని పొందవచ్చు.
- ఆ క్రమంలో ఆధార్ కేంద్రానికి..రేషన్ కార్డు, పాన్ కార్డు మొదలై ఇతర ఐడీ ప్రూప్, చిరునామా రుజువు కోసం మీ ఇంటి నీటి లేదా విద్యుత్ బిల్లుతో పాటు పాస్ పోర్ట్ సైజు ఫొటోలను తీసుకు వెళ్లాలి. లేకుంటే బ్యాంక్ పాస్ బుక్ అయినా తీసుకు వెళ్లవచ్చు.
- ఆధార్ కేంద్రంలో మీకు ఒక ఫారమ్ అందజేస్తారు ఆ ఫారమ్ నింపడంతోపాటు దానికి అవసరమైన పత్రాల జిరాక్స్‌లను జత చేస్తారు. ఇక ఈ ఫారమ్‌పై మీ ఫొటోలను అతికిస్తారు. ఈ మొత్తం పత్రాలను ఆధార్ కేంద్రంలో అందజేస్తారు. అనంతరం మీకు ఒక నెంబర్ ఇస్తారు. ఒక వేళ ఇవ్వకుంటే.. ట్రాక్ నెంబర్ ఇవ్వండని ఆధార్ కేంద్రం సిబ్బందిని కోరండి. మీకు ఆ నెంబర్ ఇస్తారు. దీంతో ఆధార్‌లో మొబైల్ నెంబర్ ఎప్పుడు చూపబడుందో మీరు తెలుసుకోవచ్చు.
- Advertisement -