నవతెలంగాణ – జన్నారం : కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నశించాలని సీఐటీయూ జిల్లా నాయకులు కూకటికారి బుచ్చయ్య మండలా కన్వీనర్ అంబటి లక్ష్మణ్ అన్నారు. బుధవారం దేశవ్యాప్త సారవత్రిక సమ్మెలో భాగంగా సీఐటీయూ, సీపీఐ(ఎం) అంగన్వాడీ వర్కర్స్ ఆ శాఖ వర్కర్స్ మధ్యాహ్న భోజన కార్మికులు చేతి వృత్తిదారులు టైలర్స్ అసోసియేషన్ కెవిపిఎస్ డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ తదితర సంఘాల నాయకులతో స్థానిక బస్టాండ్ నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తాసిల్దార్ రామ్మోహన్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికుల అర్షకులపై అవలంబిస్తున్న నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు కొండ గొర్ల లింగన్న ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోతు విజయశంకర్ మహిళలు గిరిజన సంఘ నాయకులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు నశించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES