నవతెలంగాణ – కామారెడ్డి: దేశ వ్యాప్తసమ్మెలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు జేయసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జబ్బర్ నాయక్, ఎల్లయ్య, లక్ష్మి లు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల చట్టాలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని అన్నారు. అలాగే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేసే ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. 4 కోడ్లను విభజించి రైతులను, కార్మికులను నట్టేట ముంచే విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇస్తానన్న హామీలను అమలుపరచడంలో విఫలమైందని, ఆరు గ్యారెంటీలను అమలు చేసి, ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా ఆర్డీవో కార్యాలయం అధికారి కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సదానందం, బాల్ సింగ్ నాయక్, నర్సింహులు, ఎల్లయ్య, గంగామణి, గంగన్న, విజయలక్ష్మి తో పాటు 100 మంది కార్మికులు పాల్గొన్నారు.
బహుజన వామపక్షాల ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES