- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామంలో మానవత్వం వెళ్లివిరిసింది. స్తానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ పాటశాలలో 2005-2006 సంవత్సరంలో తమతో పాటు చదువుకున్న తమ పదవ తరగతి స్నేహితురాలు సుజాత భర్త ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. సుజాత ముగ్గురు పిల్లలతో కష్టాల్లో ఉందనీ తెలుసుకుని తోటి స్నేహితులు మానవత దృక్పథంతో రూ.22000వేల అర్థిక సాయం అందజేసి చేయుతనిచ్చారు. స్నేహితులు తమను మరవకుండా చేసిన సహాయానికి సుజాత ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. తమ స్నేహితురాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమoలో తోటి స్నేహితురాలు హాసిని,కల్పన,రజిత,శ్రావణి,నవత,నిరోష,స్వప్న,స్రవంతి తోపాటు ఇతర స్నేహితులు పాల్గొన్నారు.
- Advertisement -