Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపాలి 

ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపాలి 

- Advertisement -

ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సదయ్య, రాజు 
నవతెలంగాణ – పరకాల 
: దేశవ్యాప్తంగా జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపునకు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ ఆద్వర్యంలో పరకాల ఎల్ఐసి బ్రాంచి నందు ధర్నా నిర్వహించడం జరిగింది. ‌ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సదయ్య, రాజు ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానుద్దేశించి వారు మాట్లాడారు.

బీమా ప్రీమియం పై జిఎస్టి తొలగించాలని, 1996 బ్యాచ్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, జీవిత భీమా రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కోరుతూ అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జ్యోతి, వినయ్, మల్లయ్య, రాజు, విక్రమ్, శిరీష, సావిత్రి, సారంగపాణి, రమేష్, అశోక్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -