Thursday, July 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ సలహాదారుడు సహకారంతో పనులు ప్రారంభం

ప్రభుత్వ సలహాదారుడు సహకారంతో పనులు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణ కేంద్రం నుండి రామేశ్వర్ పల్లి గ్రామానికి వెళ్లే రహదారి నూతన రోడ్డు పనులు ప్రారంభిస్తున్న సమయంలో వర్షం కారణంగా రోడ్లు గుంతలు బురదమయం కావడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తులు వెంటనే టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ కి సమస్యను వివరించారు. స్పందించిన షబ్బీర్ అలీ కాంట్రాక్టర్ కు సమాచారం అందజేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక రోడ్డు మరమ్మత్తులు పనులు చేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. స్పందించిన కాంట్రాక్టర్ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి సమస్యను పరిష్కరించారు. అనంతరం గ్రామస్తులు షబ్బీర్ అలీ కి ధన్యవాదాలు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -