- Advertisement -
- కార్మికుల సమ్మె విజయవంతం..
పెవిలియన్ గ్రౌండ్ నుండి జెడ్పీ సెంటర్ వరకు భారీ ర్యాలీ
మద్దతు తెలిపిన ఉద్యోగులు, జర్నలిస్టులు, వ్యవసాయ, రైతు సంఘాలు
నవతెలంగాణ – ఖమ్మం
భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా సమ్మె జరుగుతోందని, సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ తరఫున సమ్మెకు మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. బీజేపీ కార్మిక చట్టాలను మారుస్తోందన్నారు. పని పరిస్థితి బాగోలేకపోతే గతంలో అందరం కలిసి సమ్మె కట్టే అవకాశం ఉండేది అన్నారు. జీతం సరిపోకపోతే..కష్టం వస్తే ఒక్కళ్లం పోరాడలేం కాబట్టి సంఘం ఉండాలన్నారు. కానీ అటువంటి సంఘాలనే తీసివేసే పరిస్థితి ఉందన్నారు. సమ్మె చేసే హక్కును కాలరాస్తున్నారని చెప్పారు. ఒకసారి ఉద్యోగంలో చేరితే.. పర్మినెంట్ అయితే… వృద్ధులైతే పింఛన్.. చచ్చిపోతే నష్ట పరిహారం వస్తుందన్నారు.
కానీ ఇప్పుడు అవేవీ లేవన్నారు. ఉద్యోగులను పర్మినెంట్ చేసే విధానమే లేదన్నారు. ఇలా అనేక హక్కులు కాల రాశారని తెలిపారు. ఇదీ కార్మికుల సమ్మె మాత్రమే కాదు… దేశంలో అపారంగా ఉన్న రైతాంగానికి మినిమమ్ సపోర్ట్ ప్రైస్ (ఎంఎస్పీ) కావాలనే డిమాండ్స్ కు మద్దతుగా సమ్మె సాగుతోందన్నారు. అమెరికాలో ఒక్కో రైతుకు రూ.60 వేల సబ్సిడీ ఇస్తే మన దేశంలో మోడీ ఇచ్చేది రూ.2 వేలు మాత్రమే అని తెలిపారు. మోడీ వచ్చాక 22వ కార్మిక సమ్మె అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంత రావు అన్నారు. వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. దీనిని వ్యతిరేకించక పోతే భవిష్యత్తులో దేశం ప్రమాదంలోకి నెట్టి వేయబడుతుందన్నారు. సమ్మె ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు, రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు వై విక్రమ్, తుమ్మవిష్ణువర్ధన్, పోన్నంవెంకటేశ్వరావు, ఎర్ర శ్రీనివాసరావు, భుక్యాశ్రీను, పి.రమ్య మెరుగు సత్యనారాయణ, బండి పద్మ, మెరుగు రమణ, జిల్లా ఉపేందర్, బండారు యాకయ్య, సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు ,టియుసి ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి జి రామయ్య ,టి యు సి ఐ ఖమ్మం నగర కార్యదర్శి కే శ్రీనివాస్ ,టి యు సి ఐ ఖమ్మం నగర అధ్యక్షులు ఎం లక్ష్మీనారాయణ , టి యు సి ఐ జిల్లా నాయకులు కంకణాల శ్రీను, టి యు సిఐ నగర నాయకులు బొమ్మ కంటి రమేష్ ,ఏఐయుకేఎస్ జిల్లా అధ్యక్షులు మల్లిదు నాగేశ్వరావు, పిఓడబ్ల్యు జిల్లా సహాయ కార్యదర్శి పి శోభ ,పీడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షులు టీ ఝాన్సీ , జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, నగర కార్యదర్శి షేక్ జానీ మియా, జిల్లా కార్యవర్గ సభ్యులు మహమ్మద్ సలాం, పగడాల మల్లేష్, మేకల శ్రీనివాసరావు. - ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్పొరేటర్ బి. జి. క్లెమెంట్, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, కార్యనిర్వాహక అధ్యక్షులు రావి శివరామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల మల్లయ్య, పిల్లి రమేష్ , పేరరబోయిన మోహన్ రావు, ఎండి జాకిరుద్దీన్, జిల్లా కోశాధికారి షేక్ ఇబ్రహీం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొండపర్తి గోవిందరావు, దొండపాటి రమేష్,రాష్ట్ర సహాయ కార్యదర్శి మిడి కంటి వెంకటరెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కూచిపూడి రవి, సహాయ కార్యదర్శి దొప్పల వెంగళరావు, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, భాగం ప్రసాద్, ఉపాధ్యక్షులు ఏలూరు భాస్కరరావు,మామిడి శంకర్ రెడ్డి, వెన్నం భాస్కర్.
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తాటి వెంకటేశ్వర్లు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడిపల్లి ఏసు, మహిళా సమైక్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తాటి నిర్మల, పోటు కళావతి, ఏఐవైఎఫ్ జిల్లా కోశాధికారి కొల్లి రవి, బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రామకృష్ణ, రామస్వామి, ఏఐబీఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజేష్, కుమార్, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిపో కార్యదర్శి బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -