Thursday, July 10, 2025
E-PAPER
Homeఖమ్మంవిధుల్లో చేరిన ఎంపీడీఓ అప్పారావు..

విధుల్లో చేరిన ఎంపీడీఓ అప్పారావు..

- Advertisement -

ప్రవీణ్ కుమార్ కు వీడ్కోలు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
: స్థానిక ఎన్నికలు నేపధ్యంలో మహబూబాబాద్ జిల్లా నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ పై వచ్చిన ఎంపీడీఓ బి.అప్పారావు అశ్వారావుపేట ఎంపీడీఓ గా బుధవారం విధుల్లో చేరారు. అశ్వారావుపేట ఎంపీడీఓ గా ఇక్కడ నుండి బదిలీ అయిన ప్రవీణ్ కుమార్,అప్పారావు కు బాధ్యతలు అప్పగించారు. అనంతరం మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ కే.ప్రదీప్ ను ఎంపీడీఓ అప్పారావు మర్యాదపూర్వకంగా కలిసి సమావేశం అయ్యారు. తర్వాత వీరితో పాటు ఎంజీఎన్ఆర్ ఈజీఏ ఏపీఓ కే.రామచంద్రరావు ప్రవీణ్ కుమార్ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కుమారి,శ్రీనివాసరావు,పాషా లు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -