రైతులు, నాయకులు ఘనంగా సన్మానం
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం బుధవారం బాధ్యతలు చేపట్టింది. ములుగు జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గా రేగ కళ్యాణి ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ నేతలు మేధావుల సారాధ్యంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన విషయం విధితమే. అందులో భాగంగా డైరెక్టర్ గా తాడ్వాయి మండలం పంభాపూర్ గ్రామానికి చెందిన ముక్తి రామస్వామి ని మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియమించారు.
నూతనంగా ఎన్నికైన ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముక్తి రామస్వామి మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. నాపై నమ్మకంతో మంత్రి సీతక్క, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, మరియు రాష్ట్ర జిల్లా మండల కాంగ్రెస్ నేతలకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. నూతన మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముక్తి రామస్వామిని శాలువాలు కప్పి రైతులు, నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోలేబోయిన కృష్ణ, ఎల్లబోయిన ఝాన్సీ రాంబాబు, కల్తీ లలిత నారాయణ, యూత్ నాయకులు నాలి రవి, పోలెబోయిన కుమార్ తదితరులు పాల్గొన్నారు.