– ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ వెంకటయ్య ఆదేశం
– విద్యాశాఖ అధికారులతో సమీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు, పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను తప్పనిసరిగా పాటించాలని ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మెన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లో పాఠశాల విద్యాశాఖలో ఎస్సీ,ఎస్టీలకు అమలవుతున్న రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్లు, బ్యాక్‌లాగ్ ఖాళీలు, పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లతోపాటు మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో విద్యార్థుల నమోదుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డీఈవోలతో జూమ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల నియామకాలు, పదోన్నతుల్లో ఎస్సీ,ఎస్టీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్లను అమలు చేయాలని ఆదేశించారు. బడిబాట కార్యక్రమంలో పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను కల్పించాలని కోరారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలను అందించాలని చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (ఏఏపీసీ)ల ద్వారా పాఠశాలల్లో చేపడుతున్న పనులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో విద్యార్థుల నమోదు, సౌకర్యాల కల్పనపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీఈవోలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ నవీన్ నికోలస్, అదనపు సంచాలకులు కె లింగయ్య, రాధారెడ్డి, జేడీలు మదన్‌మోహన్, వెంకటనర్సమ్మ, ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, నేనావత్ రాంబాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
టీచర్ల నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్‌ను పాటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES