– 538 అడుగులకు చేరుకున్న నీటిమట్టం
నవతెలంగాణ-నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్లకు మరో రెండ్రోజుల్లో జలాలు తాకనున్నాయి. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు. కాగా బుధవారం రాత్రికి సాగర్ నీటిమట్టం 538 అడుగులకు పెరిగింది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 1,17,868 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇది సుమారు 10 టీఎంసీలకు సమానం అంటే రోజుకు సగటున 10 టీఎంసీల నీరు సాగర్ జలాశయంలోకి చేరుతోంది. సాగర్ జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, 184 టీఎంసీల నీరు ఇప్పటికే చేరుకుంది. మరో 128 టీఎంసీలు వస్తే 590అడుగులకు చేరుతుంది. శ్రీశైలం నుంచి వరద ఇలాగే కొనసాగితే 10 నుంచి 12 రోజుల్లో సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి 1,87,315 క్యూసెక్కుల నీరు వస్తుండగా, పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 882 అడుగులు ఉంది.
రెండ్రోజుల్లో సాగర్ గేట్లను తాకనున్న కృష్ణమ్మ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES