Thursday, July 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంలింగనిర్ధారణ నిందితుల విడుదలపై ఆగ్రహం

లింగనిర్ధారణ నిందితుల విడుదలపై ఆగ్రహం

- Advertisement -

– ఎమ్మెల్యేనే సహకారం అందించారని బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణ
– భువనగిరి పట్టణంలో రాస్తారోకో
నవతెలంగాణ-భువనగిరి

ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఆస్పత్రి నడుపుతూ లింగనిర్ధారణ, గర్భస్రావం చేసిన నిందితులను వెంటనే విడుదల చేయడంపై బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డినే సహకారం అందించారని భువనగిరి మున్సిపల్‌ మాజీ చైర్మెన్‌ ఎన్నబోయిన ఆంజనేయులు, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు ఏవి.కిరణ్‌కుమార్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. కొన్ని ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో లింగనిర్ధారణ, అబార్షన్లు చేస్తున్నారని, కలెక్టర్‌, డీఎంహెచ్‌ఓ పరిశీలించి ఆ ఆస్పత్రుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీలు అతికిం లక్ష్మీనారాయణగౌడ్‌, సూరపల్లి రమేష్‌, మాజీ జెడ్పీటీసీ సందెల సుధాకర్‌, నాయకులు ఇట్టబోయిన గోపాల్‌, కుశంగలరాజు, బర్రె రమేష్‌, తాడూరు భిక్షపతి, దొడ్డికాడి భగత్‌, కంచి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -