- Advertisement -
న్యూఢిల్లీ : బంధన్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ‘బంధన్ మల్టీ-ఫాక్టర్ ఫండ్’ను ప్రారంభించింది. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్, వాల్యూ, క్వాలిటీ, తక్కువ అస్థిరత వంటి బహుళ కారకాల ఆధారంగా పెట్టుబడులు పెడుతుంది. ఈ ఫండ్ దీర్ఘకాలిక సంపద సృష్టిని లక్ష్యంగా చేసుకుంది. 50-65 లార్జ్, మిడ్-క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెడుతుంది. ఈ కొత్త ఫండ్ జులై 10 నుండి 24 వరకు అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ వెల్లడించింది. ఇందులో కనీస పెట్టుబడిగా రూ.1,000గా నిర్ణయించింది.
- Advertisement -