Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్Dalit Ratna Award: దళితరత్న అవార్డు గ్రహీతకు మాజీ మంత్రి జానారెడ్డి అభినందనలు

Dalit Ratna Award: దళితరత్న అవార్డు గ్రహీతకు మాజీ మంత్రి జానారెడ్డి అభినందనలు

- Advertisement -


నవతెలంగాణ-పెద్దవూర
దళితరత్న అవార్డు అందుకున్న పులిమల కృష్ణారావు గురువారం నాగార్జున సాగర్ లోని మాజీ మంత్రి కుందూరి జానారెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి జానారెడ్డి పులిమల కృష్ణారావును అభినందిస్తూ శాలువాతో సన్మానం చేసినారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మాజీ కర్నాటి లింగారెడ్డి, హాలియా మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రిటైర్డ్ విఆర్ఓ నరసింహారావులు కృష్ణారావును అభినందిస్తూ సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొని నందికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ ఆదాస్ నాగరాణి విక్రమ్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బొనిగా విద్యాసాగర్, మాల మహానాడు నాయకులు జంగాల దామోదర్ తదితరులు అభినందనలు తెలియజేసినవారిలో ఉన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -