- Advertisement -
– రిక్టర్ స్కేలుపై 4.1గా తీవ్రత గుర్తింపు
ఢిల్లీ : ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 4.1గా తీవ్రతతో భూకంపం సంభవించింది. కొద్ది సెకన్ల పాటు భూమి కపించింది. హర్యానా రోహతక్ వద్ద భూకంప కేంద్రాన్ని అదికారులు గుర్తించారు. హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ప్రకంపలు చోటుచేసుకున్నాయి. నోయిడా, గురుగ్రామ్‌లోని కార్యాలయాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, షామ్లీ వరకు ప్రకంపనలు సంభవించాయి. భయంతో ఇండ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా వివరాలు తెలియలేదు.
- Advertisement -