నవతెలంగాణ – కంఠేశ్వర్ : సుప్రీంకోర్టు ఇచ్చిన నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యని అందించేలా చూడాలని మహాజన సోషలిస్ట్ పార్టీ (ఏంఎస్పీ) జిల్లా అధ్యక్షుడు సరికేల పోశెట్టి మాదిగ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలో ఉన్న నియమ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పు నియమ నిబంధనలను ఒక్కో అధికారికి ఒక్కోరకంగా ఉంటుందా…? అందరూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండాలనేది అందరికీ తెలిసిన విషయమే.
కానీ.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బేకతారు చేస్తూ ఓ ఉపాధ్యాయుడు వ్యవహరిస్తున్నాడు. అది ఎలా అంటే ప్రజా ప్రతినిధులకు పర్సనల్ అసిస్టెంట్ (పిఎ) గా ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉండకూడదని, 2016 సెప్టెంబర్ 7న విద్యార్థుల హక్కులను కాలరస్తుందని , విద్య హక్కు చట్టానికి విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దానికి విరుద్ధంగా ధర్పల్లి మండలంలోని మైలారం గ్రామ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా ఉన్న గడ్డం శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
పాఠశాలకు వెళ్లకుండా సెలవులు పెడుతూ ప్రజా ప్రతినిధి వద్ద పిఎగా వ్యవహరిస్తున్నారు అని పలు దినపత్రికలలో కథనాలు రావడం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా ఆ ఉపాధ్యాయుడిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రములో ఏంఎస్పీ, పట్టణ అధ్యక్షులు శీలంయాదగిరి మాదిగ కాందేశి నవీన్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయుడిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES