నవతెలంగాణ – మద్నూర్ : ఏండ్ల తరబడి ఎన్నో ప్రభుత్వాలు అధికారాలు చేపట్టినా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంలో విఫలమయ్యారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సారి అధికారం చేపట్టిన తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్గం బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు మాట్లాడుతూ.. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పూర్తిగా విఫలమైందని అన్నారు.
ఈ సందర్బంగా బీసీ సంఘాలు బీసీ ప్రజలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నారని అన్నారు. 42 శాతం రిజర్వేషన్ అమలు వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పిటిసి జిల్లా పరిషత్ సర్పంచి ఎన్నికల్లో బీసీలకు ఆమోదయోగ్యమైన రిజర్వేషన్ లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, సలాబత్పూర్ ఆంజనేయ స్వామి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, కొండ గంగాధర్, మాజీ సర్పంచ్ సంతోష్ పటేల్, మాజీ ఎంపీటీసీ సభ్యులు విజయ్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు వట్నాల రమేష్, యువ నాయకులు తైదల్ రాజు, కర్ల సాయిలు, కెలూరు గ్రామానికి చెందిన తోట వార్ నాగనాథ్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.