Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రగ్స్ వాడకం వల్ల మానసిక, శారీరక సమస్యలు అధికం: డా.ప్రహసిల్

డ్రగ్స్ వాడకం వల్ల మానసిక, శారీరక సమస్యలు అధికం: డా.ప్రహసిల్

- Advertisement -

నవతెలంగాణ – ధర్మసాగర్
నేటి యువత డ్రగ్స్ వాడకం వల్ల అనేక శారీరక మానసిక సమస్యలు అధికంగా ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానిక ప్రభుత్వాస్పత్రి సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రహసిల్ తెలిపారు. శుక్రవారం శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ ఆస్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగ ప్రభావాలపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి తెలిపారు. మాదకద్రవ్యాలను, డ్రగ్స్ తీసుకోవడం వల్ల అనేక శారీరక, మానసిక సమస్యలు ఎదురవుతాయని అన్నారు. ఇవి విద్యార్థుల ఆలోచన సృజనాత్మకతను నిర్వీర్యం చేస్తాయని తెలిపారు. ఇకనుండి ఏ ఒక్క విద్యార్థి కూడా మాదకద్రవ్యాలకు లోను కాకుండా ఉండాలని తెలిపారు. వారితో ప్రతిజ్ఞ కూడా చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల స్టూడెంట్ కౌన్సిలర్ ప్రభాకర్, మంజుల, రాములు, బాబురావు, వెంకట్, గణేష్, గోపాలకృష్ణ, వేణు , యాకుబ్ అలీ, మరియు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -