- Advertisement -
నవతెలంగాణ – జన్నారం : మాలలంతా ఐక్యంగా ఉంటేనే తమ హక్కులు సాధించుకోవచ్చని మాల మహానాడు జన్నారం మండల అధ్యక్షుడు దాముఖ కరుణాకర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశానికి జన్నారం నుంచి భారీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణలో తమకు న్యాయం జరగలేదని, రాష్ట్ర ప్రభుత్వం పునర్ ఆలోచించి మాలలకు న్యాయం చేయాలని అన్నారు. లేకుంటే మాల సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు. కార్యక్రమానికి బోట్ల సంజీవ్, జక్కుల సురేష్, అక్కావతుల దేవయ్య , సతీష్, తదితరులు బయలుదేరి వెళ్లారు.
- Advertisement -