నవతెలంగాణ – పెద్దవూర
ఉద్యోగుల పీఆర్పీ ని వెంటనే అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం అన్నారు. శుక్రవారం
టీఎస్ యుటిఎఫ్ పెద్దవూర మండలం సభ్యత్వ క్యాంపెనింగ్ లో భాగంగా మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శించి మాట్లాడారు. గతమూడు సంవత్సరాల నుంచి పెండింగ్ బిల్లుల విడుదల జాప్యం వలన ఉపాధ్యాయులు చాలా నిరాశకు లోనవుతున్నారని వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉత్సాహంగా టీఎస్ యుటిఎఫ్ లో సభ్యులుగా చేరారు. ప్రభుత్వ విద్యారంగ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దవూర మండలం టీఎస్ యుటిఎఫ్ అధ్యక్షులు రమావత్ కృష్ణ ప్రధాన కార్యదర్శి గోలికృష్ణ,సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి,మన్నెం వెంకటేశ్వర్లు,
ట్రైబల్ వెల్ఫేర్ ఉపాధ్యాయులు హరేందర్ రెడ్డి, ఉపేందర్, సహదేవి ,వెంకన్న, అనిల్ కుమార్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
పీఆర్సీని వెంటనే అమలు చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES